7 August, 2026 | 7:59 PM

బోనాలకు సీఎంను ఆహ్వానించిన కమిటీ సభ్యులు

20-06-2024 05:33 PM

హైదరాబాద్: ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. అనంతరం ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. నగరంలో జూలై 7వ తేదీ నుంచి బోనాలు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో మహంకాళి అమ్మవారికి ప్రజలు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్ నగరంలో గోల్కొండలోని జగదాంబిక గుడిలో మొదలై సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ సింహవాహిని దేవాలయంలో ఈ బోనాల వేడుకలు ముగుస్తాయి. ప్రజలు ఈ బోనాల జాతరను ప్రతి ఏడాది అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుపుకుంటారు.