12 March, 2026 | 10:20 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మహిళల అభివృద్ధి ధ్యేయంగా సంఘ బంధాలు

07-02-2026 12:21 AM

మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్ గౌడ్ 

గరిడేపల్లి, ఫిబ్రవరి 6: గ్రామాలలో మహిళల అభివృద్ధి కోసం సందర్భంగా కృషి చేయాలని మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని పరెడ్డిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పది లక్షలతో నిర్మిస్తున్న సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన స్థానిక సర్పంచి కేతేపల్లి నరసయ్యతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమభావన సంఘాల్లో ఉన్న మహిళలకు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ సంఘ బంధాల నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద గ్రామపంచాయతీ పరిధిలో స్థలాన్ని అందిస్తే నూతన భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ భవనాల నిర్మాణం పూర్తయితే ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సమభావన సంఘాల మహిళలందరూ ఆ భవనంలో సమావేశాలు నిర్వహించుకుని కార్యక్రమాలు చేపట్టవచ్చని తెలిపారు. మహిళల కోసం సంఘ బంధాల నూతన భవనాలను నిర్మించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరెడ్డిగూడెం గ్రామ ఉపసర్పంచ్ మేకల మల్లా రెడ్డి, వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

రాయినిగూడెం గ్రామంలో...

మండల పరిధిలోని రాయని గూడెం గ్రామంలో పది లక్షలతో నిర్మించి సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులను శుక్రవారం గ్రామ సర్పంచి గుండు రామాంజిగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు అందించి ప్రతి పథకాన్ని సంభావన సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, పంచాయతీ రాజ్ ఏ ఈ కళ్యాణ్, ఏపీఓ సురేష్, ఏపిఎం అజయ్, పంచాయతీ సెక్రటరీ సునీత, ఉప సర్పంచ్ పిడమర్తి నాగరాజు, మాజీ ఎంపీటీసీ బల్దూరు సందీప్, మాజీ సర్పంచ్ కడప దేవదానం, వార్డు సభ్యులు బాబు, గురవయ్య, కరుణాకర్, రాజు, శ్రీకాంత్, ఉషారాణి, డాక్టర్ సుష్మ, అన్నపూర్ణ, అంజమ్మ, నరేష్, అంజయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.