07-02-2026 12:22:37 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 6: మండల కేంద్రం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి పొన్నోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా కొలనులో గోపికలు స్నానమాచరిస్తుండగా కృష్ణుడు వారి కోకలను (చీరలను) దొంగిలించుకు పోయిన సన్నివేశాన్ని అర్చకులు రక్తికట్టించారు.
అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పొన్నచెట్టుపై ఉంచి తొలుత ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు చేశారు.కాగా నరసింహ స్వామి శ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,సర్పంచ్ చిలంచర్ల విద్యాసాగర్,ధర్మకర్తలు బీరెల్లి శ్రీధర్ రెడ్డి,సోమయ్య,బైరబోయిన మహారాజు, అర్చకులు రాంబాబు అయ్యంగార్, యోగానంద దీక్షితులు,పవన్ కుమార్ పాల్గొన్నారు.
8 నుంచి రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు..
అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మో త్సవాల సందర్భంగా ఈనెల 8నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు ఓపెన్ టూ ఆల్ పద్ధతిలో పురుషులకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానంద చార్యులు తెలిపారు.
శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మొదటి బహుమతి రూ.30 వేలు,ద్వితీయ బహుమతి రూ.25వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు,చతుర్ధ బహుమతి రూ.10వేల చొప్పున విజేతలకు అందజేయనున్నట్లు చెప్పారు. ఎంట్రీ ఫీజు రూ.500 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 9390146292, 8074373 955 సెల్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.