calender_icon.png 17 June, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెన్‌కో హెచ్‌ఆర్‌ను కలిసిన 1104 సంఘం నేతలు

12-06-2025 12:13:53 AM

భద్రాద్రి కొత్తగూడెం జాన్ 11 (విజయ క్రాంతి): టీఎస్ జెన్కో సిజిఎంహెచ్‌ఆర్ అజయ్ ను బుధవారం టి ఈ ఈ 1104 సంఘం నాయకులు విద్యుత్ సౌదాలో కలిశారు. ఈ సందర్భంగా టీఎస్ జనుకోలో డిపెండెంట్, మెడికల్ అండ్ ఫిట్ తదితర సమస్యలపై ఆయనతో చర్చించారు.

ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ డిపాండెంట్ ఉద్యోగాలు 121 మందికి సిఎండి సంతకా లు చేసి ఆమోదం కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కి సమర్పించారని అతని ఆదేశాలు వెలువడి న వెంటనే వారికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. మెడికల్ కాంపోజిషన్ గ్రౌండ్ కింద 16 మందికి అతి త్వరలో నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా క్యాన్సర్ పేషంట్లను ఫైల్ సర్కులేషన్ లో పెట్టి అతి త్వరలో ఆర్డర్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

డిగ్రీ అర్హత కలిగిన కార్మికులకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి ఎల్టిసి కన్వర్షన్ ఇవ్వనున్నట్లు తెలి పారు. ఓఎస్ నుండి జె పి ఏ కన్వర్షన్ ఫైల్ త్వరలో ఇస్తామని తెలిపారు. వై టి పి ఎస్ కార్మికులకు రావలసిన షిఫ్ట్ ఎలివేన్స్ ఇవ్వవలసిందని సంఘం నేతలు కోరారు. ఆర్టిజన్ కార్మిక సో దరులకు ప్రమోషన్ కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ విషయాల మీద రాష్ట్ర జనరల్ సెక్రటరీ సాయిబాబా సమక్షంలో చర్చించడం జరిగింది. హెచ్ ఆర్ ను కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు సంగం సుధీర్, జెన్కో అధ్యక్షులు కేశ బోయిన కోటేశ్వరరావు, అడిషనల్ సెక్రటరీ కుశలవ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.