16 April, 2026 | 12:08 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

బీజేపీ, బీఆర్‌ఎస్ మిలాఖత్

12-06-2025 12:14 AM

- మంచిర్యాల నియోజకవర్గానికి మంత్రి నేనే.. రాజు నేనే..

- ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు 

మంచిర్యాల, జూన్ 11 (విజయక్రాంతి): మంచిర్యాలలో బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆరోపించారు. బుధవారం మెయిన్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తే బీజేపీ, బీఆరెస్ పార్టీలు సంబరాలలో మునిగిపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మంచిర్యాల నియోజక వర్గానికి నేనే మంత్రి, నేనే రాజు అని మరో సారి స్పష్టం చేశారు. ఎవరి జోక్యం ఇక్కడ అవసరం లేదన్నారు.

డిసెంబర్ నాటికి విస్తరణ పనులు..

మంచిర్యాలలోని ప్రధాన వీధుల సుందరీకరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతా యని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు తెలిపారు. వర్షాల ఆటంకం లేకపోతే డిసెంబర్ నాటికి రోడ్ల విస్తరణ, భూగర్భ మురికి కాలువల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. రోడ్లు విస్తారంగా ఉంటేనే భావితరాలకు అభివృద్ధిని అందించిన వారమవుతామన్నారు.

కొంత మందికి రోడ్ల విస్తరణలో నష్టం జరిగినా తర్వాత కాలంలో వ్యాపారాలు ఊపం దుకుంటాయని తెలిపారు. విశ్వనాథ ఆల యం దుకాణాల సముదాయం కూల్చి వేత కు అనుమతి లభించిందని, గురువారం ఉద యం కూల్చివేతలు ఉంటాయని తెలిపారు. అలాగే వేంపల్లిలో ఐటీ పార్కుకు ఆమోద ముద్రపడిందని చెప్పారు. సమావేశంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.