4 May, 2026 | 12:35 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

వరద బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల ఔదార్యం

11-09-2024 06:12 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు వచ్చి నష్టపోయిన వరద బాధితులకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఔదార్యం చాటుకున్నారు. బేల మండలం గణేష్ పూర్ గ్రామ పంచాయతీ లోని కడ్కి గ్రామంలో వరదలతో గుడిసెలు, ఇల్లు కూలిపోయి బాధపడుతున్న ఆదివాసి కుటుంబాలకు బుధవారం బేల మండల్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి (ప్లాస్టిక్ కవర్) లను పంపిణీ చేసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గంగేశ్వర్, బేల మండలం సొసైటీ కోఆర్డినేటర్ సామ రూపేష్ రెడ్డి లు మాట్లాడుతూ ఆదివాసి కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ ఎంతో అండగా ఉంటుందని పేర్కొన్నారు. వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసిన తమ ఇంటి పైకప్పులకు ప్రమాదం జరగకుండా ఈ తాడిపత్రి (ప్లాస్టిక్ కవర్) లను అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎం.సి మెంబర్ విజయ్ బాబు, కోఆర్డినేటర్ లు దొంతుల ప్రవీణ్, నరేష్, బోక్రే శంకర్, ఠాక్రే సాగర్, కన్య రాజు, గ్రామస్తులు హుసేన్ పటేల్, సోను తదితరులు ఉన్నారు.