11 July, 2026 | 9:38 PM

Breaking News

ఆకట్టుకున్న ఐవీవై, సిద్ధార్థ రోబోటిక్స్ ఎక్స్ పో   •   సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక   •   సుల్తానాబాద్ శ్రీ శివాలయంకు లలిత అమ్మవారి విగ్రహం అందజేత   •   జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   •   ఆవుపై చిరుత దాడి   •   'పేదల కన్నీళ్లు తుడవడమే ప్రభుత్వ లక్ష్యం'   •   కోనరావుపేటలో ఘనంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు   •   బేగంపేటలో దొంగల హల్‌చల్.. 20 పంపుసెట్ల విద్యుత్ కేబుళ్ల చోరీ   •   ఉద్యమానికి సిద్ధం.. 17న మందకృష్ణ మాదిగ రాక   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత చల్మెడ   •  

స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

11-09-2024 06:16 PM

అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్

రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ఇంకెన్నాళ్ళు

హుజూర్ నగర్ ,(విజయక్రాంతి): చింతలపాలెం మేళ్లచెరువు రోడ్ లో బుధవారం స్కూల్ బస్సుకు పెను ప్రమాదమే తప్పింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు లో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి పంట పొలంలోకి జారిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పిల్లలను స్కూల్ బస్సు నుంచి దింపడంతో పెను ప్రమాదమే తప్పింది. అనంతరం అటుగా వెళ్తున్న రైతులు ట్రాక్టర్ సహాయంతో స్కూల్ బస్సుకు తాడు కట్టి బయటకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.మేళ్లచెరువు, చింతలపాలెం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణం నత్త నడకన సాగుతుంది. దీంతో రైల్వే బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు లో వాహనదారులు ప్రయాణం సాగిస్తున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసి శాశ్వతమైన పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.