calender_icon.png 24 February, 2026 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి

24-02-2026 12:39:22 AM

  1. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
  2. డీజీపీ శివధర్‌రెడ్డికి ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో/ముషీరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కుమ్మెరలో రెండు నెలల పసికందు మృతికి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన డీజీపీ శివధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతకుముందు బర్కత్ పుర చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..

బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులకు సహకరించిన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించాలని కోరారు. న్యాయం జరగకపోతే జాతీయ ఎస్సీ, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయిస్తామని, జాతీయ స్థాయిలో ఆందోళనలు చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

ఆయన వెంట బీసీ జేఏసీ వైస్ చైర్మన్ గుజ్జ కృష్ణ, తెలంగాణ విద్యార్థి వైకాస చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్, బాలరాజు యాదవ్, ఉపేందర్ చారి, స్వామి యాదవ్‌ఉన్నారు.