30 May, 2026 | 4:36 PM

అమ్మకు అక్షరమాల

30-05-2026 03:50 PM

చేగుంట,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు సందర్భంగా శనివారం మండల సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మకు అక్షరమాల(ఉల్లాస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...  వయోజనులైన  ప్రతి మహిళ, చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రతి మహిళ కనీసం వారి కుటుంబ సభ్యుల పేర్లు రాయడం, చదవడం, ఆర్టీసీ బస్సు బోర్డులు చదవడం , చిన్న చిన్న పదాలు చదవడం రాయడం చాలా అవసరం అని,వారి కోసం ప్రభుత్వం వాలంటీర్లను నియమించి, చదువు నేర్పించడం జరుగుతుందని , ప్రతి మహిళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.