calender_icon.png 12 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి

12-11-2025 01:01:26 AM

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య

యాదాద్రి భువనగిరి, నవంబర్ 11 ( విజయక్రాంతి ): నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు ప్రతిపాదన పెట్టి బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేటికీ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం పాలకులు అలసత్వానికి నిదర్శనం అని ప్రాజెక్టును పూర్తి చేయడంలో గతంలో ఉన్న ఇప్పుడు ఉన్న పాలకులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య విమర్శించినారు.

ఇప్పటికైనా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కొరకు వెంటనే రూ. 500 కోట్లు నిధులు విడుదల చేసి, నిర్వాసితులకు నష్టప రిహారం పూర్తిస్థాయిలో చెల్లించాలని  ప్రభుత్వాన్ని వారు కోరినారు. మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను పరిశీలన, రిజర్వా యర్లో భూములు గ్రామాలు కోల్పోతున్న బస్వాపురం రైతులతో,

లప్పనాయక్ తండా, తిమ్మాపురం, చౌక్లనాయక్ తండా నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరయ్య పాల్గొని మాట్లాడుతూ మొదటి నుంచి సిపిఎం పార్టీ రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో పూర్తి చేయాలని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంకు పలుమార్లు చెప్పిన పట్టించుకోక అనేక ప్రాజెక్టులను అసంపూర్తిగాని వదిలేసి గద్దె దిగిందని,  ప్రస్తుతం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిన్న ప్రాజెక్టుల విషయంలో అదే దిశగా అడుగులు వేస్తుందని విమర్శించారు. 

ఒక ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టును మరొక ప్రభుత్వం పూర్తి చేయడంలో విముఖత వ్యక్తం చేస్తున్నాయి విమర్శించారు.   అన్నారు.   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, దాసరి పాండు జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నర్సింహ, సిర్పంగి స్వామి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, మద్దేపురం రాజు, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, అన్నంపట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి, బస్వాపురం శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, మండల,

పట్టణ కమిటీ సభ్యులు మధ్యపురం బాల నరసింహ, మోట ఎల్లయ్య, కొండాపురం యాదగిరి, లక్ష్మీ నరసయ్య, కల్లూరి నాగమణి, వల్దాస్ అంజయ్య, ప్రజా సంఘాల నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, వడ్డేబోయిన వెంకటేష్, దయ్యాల మల్లేశం, మాటూరి కవిత, నరాల చంద్రయ్య, యండి బాబు, వేముల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.