భూచట్టం ప్రకారమే పరిహారం అందిస్తాం
12-06-2024 12:35 AM
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 11(విజయక్రాంతి): కేటీకే ఓపెన్ కాస్ట్ గని 3 విస్తరణలో భూములు కోల్పోయిన వారికి భూచట్ట ప్రకారం పరిహారం అందించేలా కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సింగరేణి ఓసీ 3 భూసేకరణలో భూములు కోల్పోయిన గణపురం మండలం కొండంపల్లి గ్రామస్థులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓసీపీ విస్తరణలో భూములు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్, సింగరేణి జీఎం హాబీబ్ హుస్సేన్, కవీంద్ర తదితరులు పాల్గొన్నారు.






