26 August, 2026 | 10:39 AM

36 కిలోల గంజాయిని కాల్చివేసిన పోలీసులు

12-06-2024 12:35 AM

రాజన్న సిరిసిల్ల, జూన్ 11(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న గంజాయిని పోలీసులు డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధర్యంలో 36.436 కిలోలు మంగళవారం కాల్చివేశారు. సిరిసిల్లలోని రగుడు డంప్‌యార్డ్‌లో 41 కేసులలో సాధీనం చేసుకున్న 36.4 కిలోల గంజాయిని జిల్లా ఎస్పీ ఆధర్యంలో పద్దతిలో తగులబెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగామారి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థంగా నిరోధిస్తున్నామని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసేవారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరించారు.