5 July, 2026 | 2:28 AM

బాలుడిని తండ్రికి అప్పగించిన పోలీసులు

12-06-2024 12:35 AM

వరంగల్ తూర్పు, జూన్ 11: రాత్రి సమయంలో తప్పిపోయి దిక్కుతోచని స్థితితో ఏడుస్తున్న బాలుడిని వరంగల్ ఇంతేజార్‌గంజ్ పోలీసులు చేరదీసి ఆశ్రయం కల్పించారు.. వివరాలు తెలుసుకొని బాలుడిని తండ్రికి అప్పగించారు. సోమవారం రాత్రి వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో తప్పిపోయివచ్చి ఏడుస్తూ కనిపించిన లక్కు నిషాద్(౧౦)ను బ్లూకోట్ సిబ్బంది గుర్తించి, పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం బాలుడి నుండి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బడేగావ్ ప్రాంతానికి చెందిన నిరంజన్ కుమారుడిగా గుర్తించారు. నిరంజన్ బతుకుదెరువు కోసం వరంగల్‌కు వచ్చిన పేయింటర్‌గా పనులు చేసుకుంటున్నారని తెలుసుకున్న పోలీసులు.. బాలుడి తండ్రిని గుర్తించి, సమాచారం అందించారు. తప్పిపోయిన తన కొడుకుని అప్పగించిన పోలీసులకు బాలుడి తండ్రి కృతజ్ఞతలు తెలియజేశాడు.