19-12-2025 02:03:11 AM
కాంగ్రెస్, బీజేపీ నేతల అరెస్ట్
కరీంనగర్ క్రైం, డిసెంబర్18(విజయక్రాంతి): నేషనల్ హెరాల్ కేసులో బీజేపీ రాజకీయ కక్షతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ వేధింపులను ఖండిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపుమేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించింది.అంబేద్కర్ చౌరస్తా (కోర్టు) నుండి బయలుదేరి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించడాని కి ప్రయత్నించగా ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
ర్యాలీలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తోపాటు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ ను ఇతర నాయకులను అరెస్టు చేసి బైపాస్ లోని సిటిసి కి తరలించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్ లు మాట్లాడుతూ
నేషనల్ హెరాల్ పత్రిక కు సంబంధించి ఎటువంటి మనీ లాండరింగ్ జరుగకున్నా ఈడి విచారణ పేరుతో సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని వేధింపులకు గురిచేయడం దారుణమని ఢిల్లీ కోర్టు స్పష్టమైన తీర్పు ద్వారా బీజేపీ కి చెంపదెబ్బ కొట్టినట్టయిందని అన్నారు.అరెస్టయిన నాయకులను స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు.
బీజేపీ నిరసన
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, గాంధీ కుటుంబ వారసుల అక్రమాలకు నిరసనగా బీజేపీ శ్రేణుల నినాదాలు చేశారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ముట్టడికి యత్నించడంతో పోలీసులు ఎంపీ కార్యాలయం వద్ద అడ్డుకోవడం ఉద్రిక్తత. కు దారి తీసింది. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, నాయకులు వాసాల రమేశ్ సహా బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యాన్ లో స్టేషన్ కు తరలించారు.