calender_icon.png 20 December, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారం పీఎస్‌కు అవార్డు

19-12-2025 02:02:08 AM

ఉప్పల్, డిసెంబర్ 1౮ (విజయక్రాంతి): వీ జె కన్సల్టెన్సీ  రీసెర్చ్  సంస్థ నిర్వహించిన నాణ్యత నిర్వహణ వ్యవస్థ సర్వేలో నాచారం పోలీస్ స్టేషన్‌కు ఉత్తమ గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు గురువారం నాచారం పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ ధనుంజయ గౌడ్  ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రజాభద్రత చట్టాలు అమలు శాంతి భద్రతల నిర్వహణ సేవలపై  క్యూఆర్ ఓ ఆధ్వర్యంలో కొంతకాలంగా నగరంలో పోలీస్ స్టేష న్ సందర్శించి సర్వేలు నిర్వహించామని, ఈ సర్వేలో  నాచారం పోలీస్ స్టేషన్‌కు ఉత్తమ గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ సంద ర్భంగా ఇన్‌స్పెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్‌స్టేషన్ అడ్మిన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య సెక్టార్ ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.