16 April, 2026 | 8:18 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సండే 6,267 మెగావాట్లు!

02-03-2026 12:28 AM
  1. ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్
  2. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) చరిత్రలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,267 మెగావాట్లు ఆదివారం నమోదైనట్లు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. శనివారం నమోదైన 6,057 మెగావాట్ల గరిష్ట డిమాండ్ అధిగమిస్తూ 6,267 మెగావాట్లకు చేరుకోవడం ఎన్పీడీసీఎల్ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది సంస్థ ముందస్తుగా తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యల ఫలితమని స్పష్టం చేశారు.

రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని తెలిపారు. అయినప్పటికీ, ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో అంతరాయం రాకుండా విద్యు త్ అందించేందుకు సంస్థ పూర్తిగా సమాయత్తమై ఉందని సీఎండీ ఉద్ఘాటించారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి నవీన్ మిట్టల్ నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశంతో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం గా పనిచేస్తున్నామని తెలిపారు. వచ్చే వేసవిలో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు.