17 April, 2026 | 10:32 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విజయక్రాంతి చైర్మన్ నూతన గృహప్రవేశం

02-03-2026 02:37 AM

హాజరైన ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

మంథని, మార్చి 1 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, మేనేజింగ్ డైరెక్టర్ విజయరాజం దంపతులు, డైరెక్టర్లు శ్రీకాంత్, సౌమ్య దంపతులు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముందస్తుగా శనివారం రాత్రి ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆదివారం పలువురు ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వచ్చిన వారితో సీఎల్ రాజం కుటుంబసభ్యులు కలుపుగోలుగా సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత గోమాస శ్రీనివాస్, మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ వంశీ, విజయక్రాంతి చైర్మన్ సీఎల్ రాజం మనుమరాలు శ్రీనిధి, మనుమడు శ్రీనందన్, బంధువులు పాల్గొన్నారు.