17 August, 2026 | 3:01 AM

జనగామలో డాటా ఎంట్రీ పోస్టులకు పోటీ..

17-08-2026 02:13 AM

ఒక సీటుకు 76 మంది

జనగామ, ఆగస్టు 16 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో 5 డాటా ఎంట్రీ కాంట్రాక్ట్  పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. ఈ 5 పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఆదివారం పరీక్షకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కలెక్టరేట్ గేట్ వద్ద ఉదయం నుంచే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు బారులు తీరారు. ఒక పోస్టుకు 76 మంది చొప్పున పోటీ ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగమైనా స్థిరమైన ఆదాయం కోసం యువత పెద్ద ఎత్తున తరలి రావడం గమనార్హం. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.