సీఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు
09-12-2025 01:13 AM
42% రిజర్వేషన్ల హామీ అమలు చేయలేదని నల్లగొండ పోలీసులకు బీసీ జేఏసీ ఫిర్యాదు
నల్గొండ క్రైం, డిసెంబర్ 8: ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీసీ జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు.
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడు తూ.. బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంపు వంటి హామీలను అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెం డేళ్లయినా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుం డా కొత్త జీవో 46 తీసి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, మోసీ చేశారని ఆరోపించారు.




