calender_icon.png 9 December, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మాపూర్ గ్రామాభివృద్ధే ధ్యేయం

09-12-2025 01:11:54 AM

  1. మరోసారి అవకాశం ఇవ్వండి

సర్పంచ్ అభ్యర్థి దుండ్రా రాజయ్య

తిమ్మాపూర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): తిమ్మాపూర్ గ్రామ అభివృద్ధి, ప్రజా సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని తి మ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి దుండ్రా రాజ య్య అన్నారు. స్థానిక ఎన్నికల్లో తిమ్మాపూర్ సర్పంచ్ బరిలో ఉన్నారు. తనకు మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రజల సహకారంతో నిలిపానని, ఈసారి కూడా ఉత్తమ పంచాయతీగా నిలుపుతానని, పుట్ బాల్‌గుర్తుకు గుర్తుకు ఓటెయ్యాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని రాజన్న తెలిపారు.

గతంలో సర్పంచిగా చేసిన కాలంలో గ్రామాన్ని అభివృద్ధి చేశానని మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. నూతన గ్రా మ పంచాయతీ భవనం నిర్మాణం, లైట్లువేయించడం జరిగిందని, కొత్తబోరు మోటర్లు, కొత్త పైపులైన్లు ప్రజలకు అందుబాటులో తేవడం, పలు అభి వృద్ధి పనులు చేసి గ్రామాన్ని రాష్ర్టస్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని తెలిపారు. రాజయ్య  యాదవ్‌కు మద్దతుగా ప్రజలు పెద్దసంఖ్యలో ప్రచా రంలో పాల్గొన్నారు.