calender_icon.png 9 December, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆరోగ్యంపై అవగాహన

09-12-2025 01:14:55 AM

శ్రీమాత ఆరోగ్యధామం ఆధ్వర్యంలో ఆయుర్వేద ఫెర్టిలిటీ 

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): శ్రీ మాత ఆరోగ్యధామం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుర్వేద ఫెర్టిలిటీ, మహిళల ఆరోగ్య అవగాహన కార్యక్రమం విజయ వంతంగా ముగిసింది. సహజ పద్ధతుల్లో గర్భధారణ సాధించిన 40 జంటలు ప్రత్యేకంగా హాజరవడంతో కార్యక్రమానికి ప్రత్యేక త చేకూరింది. చాలామంది జంటలు ఏళ్ల తరబడి ఎదుర్కొన్న సమస్యలు, అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఫలితం రాకపోవడం, చివరకు శ్రీ మాత ఆరోగ్యధామంలో ఆయుర్వేద చికిత్సలతో తమ జీవితంలో వెలుగు ఎలా ప్రసరించిందో భావోద్వేగంగా వివరించారు.

వైద్య నిపుణులు నాడీ పరీక్ష, దోషాల ఆధారంగా మహిళల ప్రజనన ఆరోగ్య విశ్లేషణ, హార్మోన్ల అసమతుల్యం ఎందుకు వ స్తుంది, దాన్ని ఆయుర్వేదం ఎలా సహజంగా సమతుల్యం చేస్తుంది వంటి విషయా లను అందరికీ అర్థమయ్యే భాషలో వివరించారు. సహజ గర్భధారణ కోసం అవసరమై న జీవనశైలి మార్పులు, ఆహారపద్ధతులు, ఒత్తిడి తగ్గించే పద్ధతుల గురించి కూడా ప్రజలకు చక్కగా తెలియజేశారు. సహజంగా తల్లి దండ్రులు కావాలనుకునే వారికి ఆయుర్వేదం వరమని కార్యక్రమం నిరూపించింది.