తొలివెలుగు రఘుపై ఫిర్యాదు
సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబ్ తొలివెలుగు రఘుపై చర్యలు తీసుకోవాల్సిం దిగా సత్తుపల్లి పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు తుమ్మల అభిమానులు ఈరోజు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గత 40 సంవత్సరాల నుండి రాష్ట్ర జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జీవితం తెరిచిన పుస్తకం అని ఎప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించే తుమ్మలపై రఘు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుపుతూ సత్తుపల్లి సిఐ కి కాంగ్రెస్ నాయకులు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు శివ వేణు వినుకొండ కృష్ణ కృష్ణయ్య చీకటి రామారావు చీకటి రంగారావు ఉమా గోపి శీను తో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు




