2 June, 2026 | 2:43 AM

అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు

02-06-2026 12:10 AM

మొయినాబాద్, జూన్ 1(విజయక్రాంతి): నేషనల్ హైవే పనుల పేరుతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ సాగుతోందని గ్రామస్తులు, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఆరోపించారు. సోమవారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఏఓ ప్రభుదాస్కు వారు వినతిపత్రం సమర్పించారు.

గుట్టలను తవ్వేస్తూ వంద మీటర్ల లోతున గుంతలు తీయడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, పేదలకు ఇండ్ల పట్టాలిచ్చిన సర్వే నంబర్ 51/1తో పాటు సర్వే నంబర్ 510లో అర్ధరాత్రి వేళల్లో అనుమతులు లేకుండా భారీ మైనింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

మెగా మైనింగ్ సంస్థ మేనేజర్ రాజేందర్ రెడ్డి అనుమతి పత్రాలుచూపకుండాతప్పించుకుంటున్నారని, తక్షణమే ఈ పనులను నిలిపివేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దీనిపై ఏఓ ప్రభుదాస్ స్పందిస్తూ... మైనింగ్ సంస్థ అనుమతుల వివరాలను వెంటనే సమర్పించాలని మొయినాబాద్ డిప్యూటీ తహసీల్దార్ను ఆదేశించినట్లు తెలిపారు. అక్రమ మైని్ంప విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.