2 June, 2026 | 2:43 AM

ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు

02-06-2026 12:11 AM

సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్

కామారెడ్డి, జూన్ 1 (విజయక్రాంతి): ఓటీపీలు ఎవరికి చెప్పవద్దని, సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నెంబర్ 19 30 కి కాల్ చేయాలని సాగర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్ లో జిల్లాలోని ఫోటోగ్రాఫర్లకు వీడియో గ్రాఫర్లకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. బ్యాంక్ ఆఫీసర్ గానీ పోలీస్ ఆఫీసర్లు గానీ ఓటీపీలు చెప్పమని అడగరు. ఎవరికి ఓటీపీలు చెప్పవద్దన్నారు.

అత్యవసర సమయంలో డైలాగ్ కు కాల్ చేయాలని పోలీస్ కాల బృందం ఇన్ హెడ్ కానిస్టేబుల్ రామాంచ తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్* గారి ఆదేశానుసారం సైబర్ క్రైమ్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.నరేష్ సార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలతో మోసపోతే టోల్ ఫ్రీ నం:1930 కాల్ చేయాలనీ ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని బ్యాంకు ఆఫీసర్లు గాని పోలీస్ ఆఫీసర్లు గాని ఓటీపీలు చెప్పమని అడగరు ఎవరికీ కూడా చెప్పవద్దు అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని  పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్. రామంచ తిరుపతి. పిసిలు. ప్రభాకర్. సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది. ఈకార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఫోటో గ్రాపర్స్ మరియు వీడియో గ్రాపర్స్ అసోసియేషన్ యూనియన్ పాల్గొన్నారు