ప్రజావాణిలో 11 ఫిర్యాదులు
బెజ్జూర్ సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులు వచ్చినట్లు నోడల్ అధికారి బండారి ప్రవీణ్ కుమార్(Nodal Officer Bhandari Praveen Kumar) తెలిపారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రజల యొక్క సమస్యలను ఫిర్యాదుల ద్వారా స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల వారీగా నివేదికలను అందిస్తున్నట్లు నోడల్ అధికారి తెలిపారు. నాలుగవ వార్డు మెంబర్ గుమ్మల శ్రీనివాస్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం వివరాలు గురించి, తన ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
రజక సంఘం మండల అధ్యక్షుడు 13 వార్డు నెంబర్ రమేష్ చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలం,విశ్రాంతి భవనం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పలు భూ సమస్యలు, పలు సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల వారికి ఫిర్యాదులను శాఖల వారీగా అధికారులకు అందించినట్లు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదులు చేసుకున్న వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగరాజు, పశువైద్యాధికారి లక్ష్మీనారాయణ, ఏపీవో రాజన్న, వైద్య అధికారి శ్రవణ్, ఏపిఎం మోహన్దాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.