ముస్తాబాద్ ప్రజావాణిలో 18 ఫిర్యాదులు
*మండల పరిషత్ అభివృద్ధి అధికారి లచ్చాలు
ముస్తాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి లచ్చాలు తహసిల్దార్ ఫారూక్ సమక్షంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించారు.మొదటి రోజే 18 పిర్యాదులు వచ్చాయని ఎంపీడీవో లచ్చాలు పేర్కొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భూసమస్యలు,ఇందిరమ్మ ఇండ్లు,ఇరుగేషన్ వంటి సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. ఎంపీడీఓ (03) ఎమ్మార్వో (04) ఎమ్ఏఓ (02)ఎంపీఓ (03)హౌసింగ్ (05)ఇరుగేషన్ (01) చొప్పున ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు,ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు.






