ఈవిడిఎం విభాగానికి 70 ఫిర్యాదులు
హైదరాబాద్ : నగరంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు, ఈవిడిఎం అధికారులకు 70 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు అత్యధికంగా రోడ్లపై వర్షపు నీరు నిల్వడం, చెట్ల కొమ్మలు విరిగి పడటం, చెట్లు పడిపోవడం, క్యాచ్ పిట్‌ల వద్ద వర్షపు నీరు నిలవ డం తదితర సమస్యలు అందాయి. దీంతో గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్ల పరిధిలో డిఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు రంగం లోకి దిగారు. వీటిలో0 14 చోట్ల చెట్లు పడిపోగా, 13 ప్రాంతాలలో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. 26 ప్రాంతాలలో నీరు నిలిచినట్టుగా, 17 ప్రాంతాల్లో క్యాచ్‌పిట్‌ల వద్ద నీరు సక్రమంగా పారక, నిల్వ ఉన్నట్టుగా డిఆర్‌ఎఫ్ సిబ్బంది గుర్తించారు. వీటిలో 57 ఫిర్యాదులను పరిష్కరించి న సిబ్బంది మరో 13 చోట్ల పనులు చేపడుతున్నట్టు ఈవిడిఎం డైరెక్టర్ ఎన్. ప్రకాష్ రెడ్డి తెలిపారు.






