రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తరువాత అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో పాలనాపరమైన ప్రక్షాళనంలో భాగంగా భారీ ఎత్తున ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల 20మంది జిల్లా కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీళే...
1. అవినీతి నిరోధకశాఖ జాయింట్ డైరెక్టర్ గా రుతురాజ్
2. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
3. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్
4. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
5. సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
6. రైల్వేస్ ఎస్పీగా చందన దీప్తి
7. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్
8. శంషాబాద్ డీసీపీగా బీ. రాజేశ్
9. బాలానగర్ డీసీపీగా కె. సురేశ్ కుమార్
10. మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్. కోటిరెడ్డి
11. జగిత్యాల జిల్లా ఎస్పీగా అశోక్ కుమార్
12. సూర్యపేట జిల్లా ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్
13. జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాస రావు
14. కుమురంభీం అసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాస రావు
15. మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్
16. నల్గొండ ఎస్పీగా శరత్ చంద్రపవార్
17. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
18. టీజీఎస్పీ సెకండ్ బెటాలియన్ ఆదిలాబాద్ కమాండెంట్ గా నితిక పంత్
19. డిచ్ పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ గా రోహిణి ప్రియదర్శిని
20 . మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్
21. జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బీ. రాజమహేంద్ర నాయక్






