11-11-2025 12:34:14 AM
ఇబ్రహీంపట్నం, నవంబర్ 9: జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ద కనబరచాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (29) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ13 , ఇతర శాఖలు 16, మొత్తం 29 దరఖస్తులు అందాయి. అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని సంక్షేమ హాస్టల్ నందు, గురుకులాలలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా, ఇబ్బందులు కలగకుండా చూడాలని, విద్యార్థులకు అందించే ఆహారంలో ఎక్కడ రాజీపడకుండా నాణ్యమైన ఆహారం అందించాలని తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించి బాల్య వివాహాలను అరికట్టాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
పత్తి కొనుగోలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేయకుండా ఉండకూడదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాల్య వివాహాలను ఆపండి అనే పోస్టర్ ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రిలిజీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.