11-11-2025 12:33:33 AM
మల్కాజగిరి, నవంబర్ 10(విజయక్రాం తి): మల్కాజగిరి ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాలు పేద కుటుంబాలకు ఆశీర్వాదంగా నిలిచాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని కొనసాగించడంపై సంతో షం వ్యక్తం చేశారు.
లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలన్న హామీని ప్రభుత్వం నెరవేర్చాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అనంతలక్ష్మి, గౌతమ్నగర్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.