11-11-2025 12:34:58 AM
ముషీరాబాద్, నవంబరు 10 (విజయ క్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునేం దుకు ఈ నెల 15న కామారెడ్డిలోని సత్యాక న్వెన్షన్ హాల్లో నిర్వహించే ‘బీసీ ఆక్రోష’ బహిరంగ సభను విజయవంతం చేయాలని దర్శసమాజ్ పార్టీ ముషీరాబాద్ నియోజక వర్గం అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్ అన్నా రు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ లోని ధర్మసమాజ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ ఆక్రోష బహిరంగ సభకు సంబంధిం చిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిం చారు.
ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. 42శాతం బీసీలకు రిజర్వేష న్లను కల్పించిన తరువాతే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘా ల నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సాయి యాద వ్, సాయికుమార్, రాజు పాల్గొన్నారు.