14 August, 2026 | 8:09 PM

Breaking News

నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి   •  

జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ కు పూర్తి ఏర్పాట్లు

04-11-2024 06:13 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ రమా కళ్యాణి తెలిపారు. సోమవారం పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రామాకళ్యాణి మాట్లాడుతూ.. కాళేశ్వరం జోన్ పరిధిలోని పెద్దపల్లి, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పది పాఠశాలల విద్యార్థులు దాదాపు పదమూడు వందల మంది ఈ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ లో ఈ నెల 11 నుండి 14 వరకు నాలుగు రోజులు పాల్గొననున్నారు. వారందరికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయా పాఠశాలలకు చెందిన పిఈటిలు, పీడీలు ప్రిన్సిపాల్ లు సీనియర్ స్టాఫ్ తో పాటు ప్రైవేట్ పాఠశాలల నుండి పిఈటీలను వినియోగించుకుని జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ను విజయవంతం చేస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులను అధికారులను ఈ స్పోర్ట్స్ మీట్ కు హాజరుకావల్సిందిగా విజ్ఞప్తి చేశామని తెలిపారు.