భూ దాతలకు సన్మానం
09-04-2026 12:00 AM
భైంసా, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కుంటాల మండలం వెంకూర్ గ్రామ పంచాయతీ భవనం కొరకు భూమి విరాళంగా ఇచ్చిన దాతలకు సన్మానం చేశారు. దాతలు టీకాకి పటేల్, భోజారం పటేల్, భోజబాయి, సం తోష్ పటేల్‌లకు కాంగ్రెస్ నాయకులు నాళం శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాజీరావు సర్పంచ్ వెంకుర్, దిగంబర్ మాజీ సర్పంచ్, హైమద్ పాషా, డీసీసీ జనరల్ సెక్రటరీ తాటి మహేష్, సబ్బిడి రాకేష్, సాగర్‌రావు, మాజీ సర్పంచ్ మధు, మాజీ ఎంపీటీసీ అనిల్, సబ్బిడి గజేంద్ర, సాయిబాబా, రాధాకృష్ణ, మనోహర్, గోవింద్ రావు, మారుతి పటేల్, నాళం మేడమ్ మోహ న్, నాళం రాజేశ్వర్, సాగర్, విశాల్, లక్ష్మణ్, తాటి మహిపాల్ పాల్గొన్నారు.




