30 July, 2026 | 10:47 AM

అందరికీ నాణ్యమైన విద్య అందించాలి: ఏఐఎఫ్‌ఈఏ

25-08-2024 01:46 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్య అందించాలని అఖిల భారత విద్యాసంస్థల సమాఖ్య (ఏఐఎఫ్‌ఈఏ) డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని స్టాన్లీ ఇంజి నీరింగ్ కాలేజీలో ఆ సంఘం అధ్యక్షుడు సుధీర్‌కుమార్ అధ్యక్షత జరిగిన కార్యవర్గ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఏఐఎఫ్‌ఈఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి నబ్‌కుమార్ కర్మకార్ నివేదికను ప్రవేశపె ట్టారు. తెలంగాణ నుంచి కావలి అశోక్‌కుమార్, కటకం రమేశ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.