30 July, 2026 | 8:24 AM

పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి

29-05-2024 01:27 AM

సిద్దిపేట రూరల్, మే 28: విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కొన్నిరోజులు మాత్రమే ఉన్నందున విద్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులోని మెడికల్ కాలేజీ సమీపంలో నిర్మిస్తున్న కేంద్రియ విద్యాలయం భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆట స్థలం కోసం కేటాయించిన స్థలాన్ని చదును చేయించాలని, అక్కడున్న పాతబావిని పూడ్చాలని, మెయిన్ గేట్ వద్ద విద్యుత్తు వైర్లు తగలకుండా ఎతైన స్తంభాలను ఏర్పాటు చేయాలని కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్ రాజేశ్వరిని ఆదేశించారు. కార్యక్రమంలో విద్యుత్తు శాఖ డీఈ మహేశ్, ఏఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.