5 June, 2026 | 1:08 AM

సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

05-06-2026 12:00 AM

మున్సిపల్ చైర్‌పర్సన్ సమతా వెంకట్ రెడ్డి

చేవెళ్ల, జూన్ 4(విజయక్రాంతి): చేవెళ్ల బల్దియాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక‘ వార్డు సభలు గురువారం ప్రారంభమయ్యాయి. మున్సిపాలిటీలోని 1, 2 వార్డు(ఉరేళ్ల)ల్లో నిర్వహించిన సభలకు స్థానిక నాయకులు, ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షాకాల సన్నద్ధత, తాగునీరు, జల - మన సంరక్షణ, మొక్కల పెంపకం - వన మహోత్సవం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ , వ్యవసాయం - రైతు రిజిస్ట్రీ, ఎల్ నినో  ప్రభావం వంటి ఏడు అంశాలు చర్చిజరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల వార్డుల వారీగా డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, సిసి రోడ్ల సమస్యలు తెలుసుకున్నారు. ఓటర్ల సౌకర్యార్థం పారదర్శకత కోసం సభ ప్రాంగణంలో పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌ఓల పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను అందుబాటులో ఉంచారు.మున్సిపల్ చైర్పర్సన్ సమతా వెంకట్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ కాసుల రాములు గౌడ్ మాట్లాడుతూ... వార్డుల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ’ప్రగతి ప్రణాళిక’ సభలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 

ప్రజలు తమ వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు.స్థానిక కౌన్సిలర్ దూత మల్లేష్ మాట్లాడుతూ... వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమిషనర్ యాదగిరి వచ్చే వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రజలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సలర్ డప్పు సువర్ణ (2 వ వార్డ్ మెంబెర్),బల్దీయా అధికారులు, మెప్మా సిబ్బంది GPO, AEO ప్రతిభ, డా. అనూష, పాల్గొన్నారు.