నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఎన్జీవోస్ కాలనీలో ముగిసిన సమ్మర్ క్యాంప్
విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత
హాజరైన జడ్సీ వికాస్ మహాతో, మాజీ కార్పొరేటర్లు
ఎల్బీనగర్, జూన్ 4: విద్యార్థులు నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ చత్రపతి శివాజీ గ్రౌండ్స్లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్2026 ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీతోపాటు జోనల్ కమిషనర్ వికాస్ మహాతో, డిప్యూటీ కమిషనర్ స్వామి, మాజీ కార్పొరేటర్లు హాజరై శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలను పొందడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, వివిధ రంగాల్లో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు.
యువత సర్వతోముఖాభివృద్ధికి కోచింగ్ క్యాంపులు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, మున్సిపల్ ఈఈ నాగేంద్ర, డీఈ కనకయ్య, ఏఈ విగ్నేశ్వర్, స్పోరట్స్ ఇన్ స్పెక్టర్ విగ్నేష్, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రావు, క్రాంతి గౌడ్, గంగని శ్రీనివాస్, నూతి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శంకరయ్య గౌడ్, భార్గవ్ తేజ, ప్రేమ్ నాథ్, సురేశ్ కుమార్, నరేష్ యాదవ్, నాయిని శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రావు, మధుసూదన్ రెడ్డి, విజయ్, యోగి, కిశోర్, నగేశ్, సిద్దేశ్వర్ పాల్గొన్నారు.






