25 February, 2026 | 9:19 PM

సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

25-02-2026 07:36 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం  ధనాపూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం–1923 ప్రకారం నక్షా, గ్రామ హద్దులు లేని ధనాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.

రెవెన్యూ, అటవీ శాఖల సమన్వయంతో జీపీఆర్‌ఎస్ సాంకేతికత ద్వారా వ్యవసాయ భూములను సర్వే చేసి స్పష్టమైన హద్దులు నిర్ణయించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే పూర్తయిన అనంతరం భూ వివాదాలు తగ్గి రైతులకు భూములపై స్పష్టమైన హక్కులు లభిస్తాయని, ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.