25 February, 2026 | 8:39 PM

ఆలయంలో హుండీలు ధ్వంసం

25-02-2026 07:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ సమీపంలో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దుండగులు దొంగతనానికి యత్నించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి హుండీ ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి గమనించి కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ నైలు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.