12 June, 2026 | 12:21 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

అధునాతన ఔషధ పరిశోధనలో సమగ్ర శిక్షణ

06-04-2026 08:22 PM

గీతంలో ప్రారంభమైన నాలుగు రోజుల ఫార్మాఎక్స్ ప్లోర్-2026

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు బి.ఫార్మ్ చివరి ఏడాది విద్యార్థుల కోసం ‘ఫార్మాఎక్స్ ప్లోర్-2026: అధునాతన ఔషధ పరిశోధన అంతరంగం’ అనే నాలుగు రోజుల ప్రయోగశాల సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అత్యాధునిక పరిశోధనా సదుపాయాలు, వర్ధమాన ఔషధ అభివృద్ధి సాంకేతికతలను ఔత్సాహిక ఫార్మసిస్టులు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక విశిష్ట వేదికను కల్పించింది.

ఇందులో పాల్గొంటున్నవారు అధ్యాపకులు, పరిశోధకులతో చురుకుగా సంభాషిస్తూ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో విస్తృతంగా ఉపయోగించే ఆధునిక పరికరాలు, వినూత్న పరిశోధన సాధనాలతో ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతున్నారు. సమగ్ర అభ్యాస అనుభవంలో భాగంగా, విద్యార్థులను మార్గదర్శక ప్రయోగశాల పర్యటలకు తీసుకెళ్లి, అత్యాధునిక విశ్లేషణాత్మక పరికరాలను ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పిస్తున్నారు.