27-06-2025 06:09:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): సీపీఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ కామ్రేడ్ కృష్ణ మూడో వర్ధంతి వేడుకలను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కృష్ణ చిత్రపటానికి స్థానిక నాయకులు పూలమాలలు వేసి పేదల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని జిల్లా కార్యదర్శి రాజన్న కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ గంగాధర్ గంగన్న గంగామణి తదితరులు పాల్గొన్నారు