7 July, 2026 | 2:58 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీ సీఈవో శోభారాణి

27-06-2025 06:06 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామం పరిధిలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని, సరుకులను, కూరగాయలను, అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులు పాఠ్యఅంశాలను గురించి తెలియజేశారు.

అనంతరం సీఈవో శోభారాణి మాట్లాడుతూ... విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని, అల్పాహారాన్ని, స్నాక్స్ ను అందజేయాలని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పాఠశాలల్లోని ఏను విద్యార్థుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జితేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి జ్యోతిలక్ష్మి ప్రిన్సిపాల్ దుర్గ తదితరులు పాల్గొన్నారు.