calender_icon.png 13 September, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం గర్వించదగ్గ మహా నాయకుడు కామ్రేడ్ సీతారామ్ ఏచూరి

13-09-2025 02:30:00 AM

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12: సిపిఐఎం అఖిల భారత మాజీ కార్యదర్శి కామ్రేడ్ సీతారామ్ ఏచూరి వర్ధంతి సందర్భంగా శుక్రవారం చందానగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏచూరి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి లు అర్పించారు.. ఈ సందర్భంగా  శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి చెల్ల శోభన్ మాట్లాడుతూ దేశం గర్వించ దగ్గ మహా నాయకుడు కామ్రేడ్ సీతారామ్ ఏచూరి అని అన్నారు.

విద్యార్థి దశ నుంచి అనేక ఉద్యమాలు చేస్తూ కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వం స్థాయికి చేరుకుని జీవితాంతం ప్రజలకు సేవ చేశారని కొనియాడారు.మతతత్వ పాలనకు వ్యతిరేకంగా దేశంలో ఒక ప్రత్యామ్నాయ కూటమికి రూప కల్పన చేయటంలో ఆయన పాత్ర అమోఘం అని అన్నారు. అధిక ధరలు, నిరుద్యోగం, మత ఛాందస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ఆయన ఆశయ సాధనకు కృషి చేసినట్టు గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో ఏచూరి స్పూర్తితో మరిన్ని ఉద్యమాలు చేయాలని పిలుపు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  సిపిఐఎం  జోన్ నాయకులు మాణిక్యం, కొంగరి కృష్ణ, మల్లి కార్జున్, సయ్యద్ ముజా మిల్, అశోక్, సాయిలు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.