calender_icon.png 13 September, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల త్యాగాలను స్మరించుకుందాం

13-09-2025 02:28:16 AM

అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 12:  నిజాం నిరంకుశ పాలనకు భూస్వామ్య ఆదిపత్య భావజాలనికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులు త్యాగాలను గుర్తు చేసుకోవాలని సీపీఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి  అజ్మీరా హరిసింగ్ నాయక్ అన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం రావి నారాయణ రెడ్డి ఫేస్-1లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హరిసింగ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై.. సీపీఐ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి  స్వాతంత్రం వచ్చిన తరువాత హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ ప్రాంతం నిజాం రాచరిక పాలనలో  నలిగిపోతున్న ప్రజలను కనీసం మనుషులుగా గుర్తించబడని సమయంలో, కమ్యూనిస్టు పార్టీ  నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి తెలంగాణలోని వేలాది గ్రామాలని నిజాం పాలన నుంచి విముక్తి చేసి, భూస్వాముల నుంచి లక్షలాది ఎకరాల భూములు తిరిగి రైతులకి అప్పగించిన ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదన్నారు.

అదేవిధంగా పేదలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, నరసింహ, మాసయ్య, కలమంద కాసిం, కురుమయ్య, అనుష, స్వామి, బాల్ ఎల్లయ్య, కాశయ్య, శ్రీను, చిన్నమ్మ, పద్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.