సుబ్బంపేటలో ‘అమ్మమాట’ - అంగన్వాడీ బడిబాట’ ముగింపు
నషాముక్త భారత్ ప్రతిజ్ఞ
చర్ల, జూన్ 19 (విజయక్రాంతి): చర్ల మండల పరిధిలోని సుబ్బంపేట సెక్టార్ అంగన్వాడి సెంటర్లో ‘అమ్మమాట - అంగన్వాడి బడిబాట’ కార్యక్రమం శుక్రవారం ముగింపు వేడుకతో ఘనంగా ముగిసింది. కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొని చిన్నారుల విద్య, పోషణ ప్రాముఖ్యతపై నినాదాలు చేస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ ‘నషాముక్త భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువతచే మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాక సత్యనారాయణ, సెక్టార్ సూపర్వైజర్ బంద స్వరూపరాణి, గ్రామ కార్యదర్శి సర్వేశ్వరావు, అంగన్వాడీ టీచర్ నాగమణి, ఆయా లక్ష్మి, గ్రామస్తులు విశాలి, సీతారత్నం, సుబ్బలక్ష్మి, కృప భవాని, నాగ భవాని, రామక్క తదితరులు పాల్గొన్నారు






