7 March, 2026 | 9:47 AM

అద్దె భవనాల్లో అవస్థలు!

07-03-2026 12:00 AM

నిధులు లేక నిలిచిన పనులు

వెల్దండ, మార్చి 6:ప్రభుత్వం తండాలను మారుమూల గ్రామాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అందుకు అను గుణంగా పాలకవర్గం ఏర్పాటు, అధికారుల నియామకం వంటి చర్యలు చేపట్టింది. అం తా బాగా ఉన్నప్పటికీ పంచాయతీలు ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా నేటికీ గ్రామపంచాయతీ భవనం నిర్మాణం చేపట్టకపోవడంతో పాలకులకు అధికారులకు అవస్థలు తప్పడం లేదు.

వెల్దండ మండలంలో మొత్తం 32 గ్రా మపంచాయతీలు ఉండగా, పాత గ్రామ పంచాయతీలైన 12 పంచాయతీలకే భవన సౌకర్యం ఉంది. మిగిలిన 20 గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణం కోసం ప్ర భుత్వం వివిధ పథకాల కింద ఒక్కొక్కదానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది.కొన్ని చోట్ల భవన నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పూర్తికావడం లేదు.

అధికారులు పూర్తిస్థాయిలో దృ ష్టి సారించకపోవడం నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 5 గ్రామాల్లో భవనాల పనులు తుది దశలో ఉన్నప్పటికీ బిల్లు రాకపోవడంతో కాంట్రాక్టర్లు  పనులు పూర్తిగా నిలిపివేశారని తెలుస్తోంది.  తిమినోన్పల్లి పోచమ్మ గడ్డ పంచాయతీలో భవనిర్మానికి నేటికి స్థలాన్ని గుర్తించకపోవడంతో నిధులు వెన్నుతిరిగాయి,

మిగతా గ్రామపంచాయతీలో పనులు వివిధ దశల్లో నిలిచిపో యాయి. దీంతో గ్రామాల్లో అంగన్వాడీ కేం ద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు , ప్రైవేట్ భవనాల్లో గ్రామపంచాయతీ  కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అధికారులు ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

అధికారులు, పాలకులు  చొరవ తీసుకుని అవసరమైన నిధులు విడుదల చేసి పంచాయతీ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని  ప్రజలు కోరుతున్నారు.