6 March, 2026 | 11:36 PM

99 రోజుల కార్యాచరణపై మంత్రి పొన్నం సమీక్ష

06-03-2026 03:53 PM

హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో హైదరాబాద్ జిల్లా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక(Praja Palana Pragati Pranalika) 99 రోజుల కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్ , జీహెచ్ ఎంసీ కమిషనర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అధికారులతో, సహచర మంత్రి అజారుద్దీన్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో మార్చి  6 నుండి జూన్12  వరకు జరగనున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో చేయాల్సిన అంశాలపై  దిశా నిర్దేశం చేశారు. 

99 రోజుల ప్రణాళిక లో బాగంగా హైదరాబాద్ జిల్లాలో పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ పరిష్కరణ, ఆరోగ్యం ,సురక్షితంగా చేరుకోవడం భద్రత,సంక్షేమం ,పిల్లల భద్రత, రక్షణ డ్రగ్స్ కి నో ,విద్య, యువత, క్రీడలు , మహిళలు , పర్యావరణం అంశాలపై మండల, నియోజకవర్గ జిల్లా స్థాయి అంశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించినట్లు తెలిపారు. ఈరోజు నుండి 99 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రారంభం అవుతుందన్న మంత్రి ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.