27 July, 2026 | 11:59 AM

అడపా లచ్చయ్య దొరకు పరామర్శ

27-07-2026 11:29 AM

దమ్మపేట, జూలై (విజయక్రాంతి): సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొర మాతృ మూర్తి అడపా పుష్పావతి ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు అడపా లచ్చయ్య దొరను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, కాంగ్రెస్ నాయకులు అత్తులూరి వెంకట రామారావు, పగడాల రాంబాబు, వాసం శ్రీను, చిన్నశెట్టి యుగంధర్,సాయిల నర్సీ, ఈశ్వరప్రగడ నాగ భూషణ్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.