16 May, 2026 | 2:50 AM

వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించండి

16-05-2026 01:18 AM

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పాశ్య పద్మ

అబ్దుల్లాపూర్‌మెట్, మే 15: వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రైతు సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పాశ్య పద్మ అన్నారు. నామినేటెడ్ పాలక మండళ్లను నియమించాడని  వ్యతిరేకిస్తూ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంతం మాధవరెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశ్య పద్మ హాజరయ్యారు. ధర్నా అనంతరం అబ్దుల్లాపూర్ మెట్ డిప్యూటీ తహసీల్దార్ వేణు మెమోరాండం అందజేశారు.

సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, రాష్ట్ర నాయకులు ముత్యాల యాది రెడ్డి, మండల నాయకులు నరసింహ,దాసరి ప్రసాద్, పొన్నాల యాదగిరి, సైదులు, ఈశ్వర్, సాయిలు, మంగళపల్లి రవి, పాండు, తదితరులు పాల్గొన్నారు.