17 July, 2026 | 2:41 PM

ఇన్సూరెన్స్ పథకాన్ని సద్వినియం చేసుకోండి

17-07-2026 02:41 PM

నిర్మల్ జులై 17 (విజయక్రాంతి):  కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయడం జరుగుతుందని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే ముత్యం రెడ్డి తెలిపారు. జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు సహజ మరణం రిలీఫ్, ప్రమాదవశాత్తు మరణం దివ్యాంగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఈనెల 23 లోపల చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఇదివరకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకున్న వారి గడువు ఈనెల 23న ముగుస్తున్న నేపథ్యంలో కొత్తగా ఇన్సూరెన్స్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు ఈ అవకాశాన్ని భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగించుకోవాలని సూచించారు.